బ్రిటన్ కోచ్ టీమ్ దక్కన్ ఛార్జర్స్ రైట్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ దక్కన్ ఛర్జర్స్ అమ్మకం కోసం బీసీసీఐ టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్వవహారంపై హైకోర్టు జోక్యం చేసుకోజాలదని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై దిగువ కోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్ టిమ్ రైట్‌కు సూచిస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ప్రస్తుతం దక్కన్ ఛార్జర్స్ అమ్మకానికి పెట్టటంతో పాటు ఈ వ్వవహారాన్ని టెండర్ల ప్రక్రియ ద్వారా బీసీసీఐ నిర్వహించడాన్ని సవాలుచేస్తూ టిమ్ రైట్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.



