భక్తిశ్రద్ధలతో నిమజ్జన వేడుకలు… మార్మోగిన గణనాధుని నామస్మరణం….
కన్నుల పండువగా దినభందు కాలనీ లో శివశక్తి యూత్ ఆధ్వర్యంలో గణనాధుని శోభాయాత్ర…
కూకట్ పల్లి (జనంసాక్షి):తొమ్మిది రోజులపాటు భక్తుల నుంచి విశేష పూజలు అందుకున్న గణనాధుడిని శనివారం వైభవంగా నిమజ్జనానికి తరలించారు.కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని దినభందు కాలనీ శివశక్తి యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో కొలువుదీరిన గణపయ్యకు నవరాత్రులు ఉత్సవాలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లడ్డు వేలంపాటలో పాల్గొని చివరకు 50500 కు రాజయ్య దంపతులు కైవసం చేసుకున్నాడు. జై బోలో గణేష్ మహరాజ్ కి జై అంటూ భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం కన్నుల పండువగ సాగింది.తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి పయనమయ్యాడు.బ్యాండ్ మేళాలు,భక్తి గేయాలు,మహిళల కోలాటాలు, పిల్లల కేరింతల నడుమ యువత చిందులేస్తూ ముందుకు సాగింది.రాధికా, అమృత, చంద్రకళ, సారిక, గిరిజ,సంజని, శ్రీలత,మేధాశ్రీ, లక్ష్మి, మేఘన, రాంచేందర్ రావు, నగేష్, నర్సింహా,రాజు, రవి, రాజయ్య,కౌశిక్, శ్రీకాంత్, తేజ, రోహిత్, కార్తీక్, వర్షిత్ తదితరులు పాల్గొన్నారు.