భాజపా ఎమ్మెల్యేచెంప ఛెడేల్‌

share on facebook

` మీరు రైతుద్రోహులంటూ అన్నదాత ఆగ్రహం
లక్నో,జనవరి 8(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సవిూపిస్తున్న వేళ అక్కడి రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ క్రమంలోనే ఓ ఘటన ఇప్పుడు యూపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అదేంటంటే.. బహిరంగ సభలో ఓ రైతు నాయకుడు అందరూ చూస్తుండగానే అధికార భాజపా ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే.. భాజపా ఎమ్మెల్యే పంకజ్‌ గుప్తా మూడు రోజుల కిందట ఓ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరై బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఓ రైతు నాయకుడు వేదికపైకి వచ్చి అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించాడు. ఈ హఠాత్‌ పరిణామంతో కాసేపు అందరూ నివ్వెరపోయారు. అనంతరం పోలీసులు ఆ రైతుని వేదికపై నుంచి కిందికి తీసుకెళ్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుండటంతో ఎమ్మెల్యే పంకజ్‌ గుప్తా, చెంపదెబ్బకొట్టిన రైతుతో కలిసి విూడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు.ఎమ్మెల్యేను అభిమానంతోనే కొట్టానని ఆ రైతు నాయకుడు సమర్థించుకున్నాడు. ఎమ్మెల్యే పంకజ్‌ గుప్తా మాట్లాడుతూ.. ‘అతడు నా తండ్రి లాంటివాడు. మేం చాలాసార్లు కలిసి పనిచేశాం. అతను నన్ను ప్రేమతో మాత్రమే కొట్టాడు. చెంపదెబ్బ కొట్టలేదు. ప్రతిపక్షాలు కావాలనే ఎడిట్‌ చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచి చక్కర్లు కొట్టిస్తున్నాయి’ అని వెల్లడిరచారు. మరోవైపు, ఈ ఘటనపై సమాజ్‌వాది పార్టీ స్పందించింది. భాజపా ఎమ్మెల్యే పంకజ్‌ గుప్తా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఓ రైతు నాయకుడు ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టాడు. ఈ చెంపదెబ్బ ఎమ్మెల్యేని కొట్టినట్టు కాదని.. నిరంకుశ పాలనను అందిస్తున్న యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని కొట్టినట్లని విమర్శించింది. ఏమైనా సదరు రైతు నాయకుడు ఎమ్మెల్యేని కోపంతో కొట్టినా.. అభిమానంతో కొట్టినా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ విూడియాలో వైరల్‌ అయ్యాయి.

Other News

Comments are closed.