భారత్‌, శ్రీలంకల మధ్య నేడు రెండో వన్డే

హంబస్‌టోట : ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్‌, శ్రీలంక జట్ల మధ్య మంగళవారం రెండో మ్యాచ్‌ జరగనుంది. తోలి వన్డేలో విజయం సాదించిన భారత్‌ ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. గాయం కారణంగా సీరిస్‌ నుంచి తప్పుకున్న శ్రీలంక బౌలర్‌ నువాన్‌ కులశేఖర స్థానంలో ప్రదీప్‌ జట్టులోకి వచ్చాడు. హంబస్‌టోటస్‌లో టాస్‌ కీలకం కానుంది. అరంభంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కాబట్టి టాస్‌ గెలిచిన కెప్టెన్‌ బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. మద్యాహ్నం రెండు గంటల నుంచి టెన్‌ క్రికెట్‌లో ప్రత్యేక ప్రచారం కానుంది.