భారత మాజీ సైనికాధికారి బ్రార్‌పై పదునైన ఆయుధంతో దాడి
లండన్: భారత మాజీ సైనికాధికారి కులదీప్‌సింగ్ బ్రార్‌పై పదునైన ఆయుధంతో దాడి జరిగింది. బ్రార్ 78 ఏళ్ల బ్రార్‌పై లండన్లో ఒక హోటల్ ముందు ముగ్గురు వ్యక్తులు దాడి చేసి ఆయన గొంతుకోయడానికి ప్రయత్నించారని బ్రార్ భార్య తెలిపినట్లు భారత హై కమిషన్ పేర్కొంది. దుండగులు ఆమెను కూడా కిందపడదోశారని, బ్రార్‌పై పిడిగుద్దులు గుద్దుతూ ఆయుధంతో గొంతుకోయాడానికి ప్రయత్నించారని తెలిపింది. బ్రార్ దంపతులు ఆక్స్‌ఫర్డ్ సర్కస్‌నుంచి తిరిగివస్తుండగా ఈ దాడి జరిగింది. వెంటనే ఆస్పత్రికి తరలించిన ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారని, బ్రార్ త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నామని అధికారులు తెలిపారు.



