భార్యను నరికి చంపిన భర్త

రామగుండం : కుటుంబకలహాల నేపథ్యంలో  ఓ వ్యక్తి తన భార్య, అత్తపై దాడి చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లా రామగుండం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా.. అత్త పరిస్థితి విషమంగా ఉంది. స్థానికంగా మేసీగా పనిచేస్తున్న కుమారస్వామి అనే వ్యక్తి  నిన్న అర్థరాత్రి భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్తపై కూడా దాడికి దిగాడు. తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానికులు పెద్దపల్లి ఆసుపత్రికి తలించారు. ఈ ఘటనల అనంతరం అతను పురుగుల మందు తాగి  ఆత్మహత్యాయత్నం చేశాడు.