భార్యపై కత్తిపిటతో దాడిచేసిన కానిస్టేబుల్
బేగంపేట : బాద్యతాయుతమైన పోలీసు వృత్తిలో ఉండి భార్యపై కత్తి పీటతో దాడి చేసిన కానిస్టేబుల్‌పై బేగంపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది, పోలీసుల కథనం ప్రకారం మెదక్ జిల్లా ఉప్పర్‌పల్లి సుభాష్ మారేడుపల్లి పోలీసుస్టేసన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు, కుటుంబంతో కలిసి ఇతడు బేగంపేట పోలీస్‌క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం మేనకోడలు సవితతో ఇతనికి వివాహం అయ్యింది. మూడు నెలల క్రితం డబ్బుల కోసం ఇతరులను భ్లాక్ చేసినందుకు సస్పెండయ్యాడు. ఇదే విషయమై భార్య భర్తల మధ్య తగువు రావడంతో కోపోద్రిక్తుడై బార్య అడ్డువచ్చిన అత్తపైన కత్తి పీటతో దాడి చేయడంతో భార్య మెడపై గాయమైంది.బాదితురాలిని అసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు



