భార్య అందంగా లేదంటూ వేధింపులు.

share on facebook
తట్టుకోలేని మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన కరణ్
కో ట్ పోలీసులు.
తాండూరు ఫిబ్రవరి 18 (జనం సాక్షి)
ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు.
జీవితాంతం అండగా ఉంటానని మాటలు చెప్పి తీరా పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాలు గడవకముందే తన భార్య అందంగా లేదంటూ ఆమెపై వేధింపులకు దిగాడు భర్త .భర్త వేధింపులు తట్టుకోలేని ఆ మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టింది .ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో చోటు చేసుకుంది.జిన్గుర్తి గ్రామానికి చెందిన మహేష్ యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన సునీత (23)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు సజావుగా జరిగిన వీరి కాపురం చిన్న చిన్న తగాదాలు కస్త పెద్దదయింది.భర్త మహేష్ భార్య ను నువ్వు అందంగా లేవంటూ నువ్వు చనిపోతే మరో వివాహం చేసుకొని దర్జాగా ఉంటానంటూ భర్తపై వేధింపులకు దిగి శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవాడు. ఈ మధ్యకాలంలో వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో తట్టుకోలేని సునిత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తన చెల్లెలు మహేష్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలు సునీత సోదరి అనిత ఫిర్యాదు మేరకు కరణ్కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Other News

Comments are closed.