భూసార పరీక్షలు తప్పనిసరి చేశాం

– అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి పోచారం వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో భూసార పరీక్షలపై సుదీర్ఘ చర్చసాగింది.. ఈ సందర్భంగా పలువురు సభ్యులు భూ సార పరీక్షల జరుగుతున్న విధానం, ఎంత మేరకు భూసార పరీక్షలు నిర్వహించారు.. ఎంత మందికి భూసార పరీక్షల కార్డులు ఇచ్చారో వివరించాలని మంత్రిని సభ్యులు కోరారు.. దీంతో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు దిగుబడి రావాలన్నా.. పెట్టుబడి తగ్గించాలన్నా భూసార పరీక్ష వివరాలు తెలియాలన్నారు. రైతుల సంక్షేమం దృష్ట్యా భూసార పరీక్షలు తప్పనిసరి చేశామన్నారు. రెండేళ్లకోసారి భూసార పరీక్షలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. 2017-18, 2018-19 ఏడాదికి గానూ 9 లక్షల 73 వేల ఎకరాలకు భూసార పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 55 లక్షలకు పైగా రైతులకు భూసార పరీక్ష కార్డులు అందజేశామని

చెప్పారు. భూసార పరీక్షలను నిర్వహించేందుకు 2050 మినీ భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు గానూ 5 వేల ఎకరాలకు ఒక ఏఈవో చొప్పున 2 వేల మంది ఏఈవోలను

నియమించామని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి పోచారం స్పష్టం చేశారు.

తాజావార్తలు