మండల కేంద్రంలో 14వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు.
బూర్గంపహాడ్ సెప్టెంబర్ 01(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కొన సాగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్షలు నేటికీ 14వ రోజుకు చేరుకున్నాయి. నేడు దీక్షలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు , పురుషులకు మాజీ ఎమ్మెల్యే సతీమణి జె ఏ సి మహిళా కో-ఆర్డినేటర్ కుంజా వెంకటరమణ, యస్ కె గౌష్యా బేగం వారికి పూలమాలలు అందించి దీక్ష ప్రారంభించారు. దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం ప్రకటించిన వారు సిపిఐ మండల కార్యదర్శి మువ్వ వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు పేరాల శ్రీనివాసరావు, బాలకృష్ణ సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, రాయల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలపల్లి సుధాకర్ రెడ్డి, పోల్కొండ ప్రభాకర్, మంద నాగరాజు, యస్ కె దస్తగిరి, దాసరి సాంబ, ఆటో యూనియన్ సభ్యులు, జేఏసి కన్వినర్ కే వి రమణ, జేఏసీ ప్రధాన కార్యదర్శి దామర శ్రీను, జేఏసీ సభ్యులు మున్న, తోకల రవి ప్రసాద్, న్యూ సెంచరీ విద్యాసంస్థల అధినేత ఆశిక్ లైక్, బాబా, చోటే, మహిసాక్షి రామసీత పాల్గొన్నారు. దీక్షలో ఎస్.కె రహి మున్నీసా, యస్ కె నశ్రీన్, ఎస్.కె నజరీన్, ఎస్.కె, రాజు, లక్ష్మణరావు, తోకల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.