మంత్రి గంగుల సమక్షంలో తెరాసాలో చేరికలు
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
కరీంనగర్ కిసాన్ నగర్ 25వ డివిజన్ కు చెందిన బీజేపీ ST మోర్చా నార్త్ జోన్ ప్రెసిడెంట్ గుగులోత్ శ్రీకాంత్, బోనే సాగర్ తో పాటు 100 యువకులు మంత్రి గంగుల సమక్షంలో తెరాసా తీర్థం పుచ్చుకున్నారు.
తెరాసలోకి చేరిన యువకులకు మంత్రి గంగుల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ యువత ఆత్మగౌరవం కాపాడేది టిఆర్ఎస్ పార్టీ అని వెల్లడించారు. తెలంగాణలో ఢిల్లీ పార్టీలకు స్థానం లేదని గ్రహించి పెద్ద ఎత్తున యువకులు గులాబీ గూటికి చేరుతున్నారని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోట రాములు, సీనియర్ నాయకులు బండ రమేష్, అవినాష్ గౌడ్ తదితరులు ఉన్నారు