మంత్రి చేతుల మీదుగా పరిశ్రమ ప్రారంభం

చౌటుప్పల్‌ : నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేటలో ఏర్పాటు చేసిన ఫార్చూన్‌ టైర్‌ రీట్రెడింగ్‌ పరిశ్రమను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశంలోనే మొట్ట  మొదటగా ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. బొత్స ఈ పరిశ్రమలో టైర్‌ రీట్రెడింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి పాల్గోన్నారు.