మంత్రి జానారెడ్డి ఛాంబర్‌లో కాంగ్రెస్ నేతల భేటీ
హైదరాబాద్: నేతల భేటీలు జోరందుకున్నాయి. ఉదయం ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో కొందరు మంత్రులు సమావేశం కాగా తాతాగా మంత్రి జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భేటీ అయినట్లు సమాచారం. చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భిక్షమయ్యగౌడ్, ఆదాల, గాదె, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గోన్నారు. తెలంగాణ మంత్రుల వైఖరిపై ప్రభుత్వం చీఫ్ విప్ గండ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అధినేత్రికి లేఖ రాసినప్పుడు మంత్రి వర్గ హోదా ఉన్న విప్‌లను ఎందుకు సంప్రతించలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత విప్‌లతో కలిసి ప్రత్యేక లేఖ పంపుతామని గండ్ర పేర్కొన్నట్లు సమాచారం.



