మంత్రి పితాని నివాసం ముందు ఆందోళన

హైదరాబాద్‌: పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో మెస్‌ ఛార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఉదయం వైకాపా కార్యకర్తలు మంత్రి పితాని ఇంటిని ముట్టడించారు. సంక్షేమ హాస్టళ్లలో వసతులు కల్పించలేని మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఇంట్లోకి ప్రవేశించడానికి నాయకులు యత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారు.