మంత్రుల సుడిగాలి పర్యటనలు

ప్రజలను తరలించడమే లక్ష్యంగా భేటీలు

హైదరాబాద్‌,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): ప్రగతి నివేదన సభకు ప్రజలను భారీగా తరలించడమే లక్ష్యంగా జిల్లాల్లో మంత్రులు సుడిగాలి పర్యటనలు చేసి దిశానిరద్దేశం చేస్తున్నారు. మరొక్కరోజే గడువు ఉండడంతో ఇప్పటికే ప్రణాళిక సిద్దం అయ్యింది. రూటు మ్యాపులు సిద్దం అయ్యాయి ఎవరు ఎక్కడి నుంచి ఎలా రావాలన్న దానిపై స్పష్టత ఇచ్చారు. ఉప్పెనలా కదిలి రావాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పిలుపునిచ్చారు. కొంగరకలాన్‌ సభను విజయవంతం చేయాలంటూఆయా నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గాల పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లో మంత్రులు పాల్గొంటూ స్పష్టమైన ఆదేవౄలు ఇచ్చారు. లక్ష్యానికి మించి ప్రజలు తరలివస్తారని చెబుతున్నారు. వారికి వాహనాలు సమకూర్చలేని స్థితి ఏర్పడిందంటున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు జాతరలా వెళ్లేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఉప్పెనలా కదిలి రావాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 30 వేల మంది తరలిరావాలని కోరారు. దేశ చరిత్రలో నిలిచిపోయేలా సభను విజయవంతం చేసేందుకు ప్రతిగ్రామం నుంచి తరలిరావాలని సూచించారు. ప్రగతి నివేదన సభకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి ప్రతిపక్షాల గుండెల్లో దడ పుట్టించాలన్నారు. ప్రగతి నివేదన సభకు తరలి వెళ్లేందుకు మన రాష్ట్రంలోని బస్సులు సరిపోవడం లేదని, కర్ణాటక, ఏపీ నుంచి బస్సులు, వాహనాలను తెప్పించాల్సి వస్తున్నదని అంటున్నారు.

ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలను అందించామని, తాము చేసిన అభివృద్ధిని ప్రజల ముందు సగర్వంగా నివేదించుకుంటామన్నారు. ప్రభుత్వం పాలన చేపట్టి 50 నెలలు పూర్తయిన సందర్భంగా ఇంతవరకూ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేశామన్నారు. నాలుగేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రగతి నివేదన బహిరంగ సభకు తరలి వెళ్లేందుకు జిల్లా/రిళి నుంచి సబ్బండ వర్ణాలు సిద్ధమవుతున్నాయి.. ఒక్కో జిల్లా నుంచి లక్ష మందికిపైగా జన సవిూకరణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుండగా.. స్థానిక ఎమ్మెల్యేలు భారీ జన సవిూకరణపై దృష్టి పెట్టారు.. ఇప్పటికే ఆర్టీసీ, ప్రైవేటు పాఠశాలల బస్సులు సిద్ధం చేయగా.. ప్రైవేటు వాహనాలు రెడీగా ఉంచారు.. మండలాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు.. పార్టీ ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులకు మండలాలు, గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో సవిూక్షలు నిర్వహిస్తుండగా.. ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రగతి నివేదన సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహన సౌకర్యంతో పాటు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు. ఒక్కో వాహనానికి ఒకరిని బాధ్యులుగా పెట్టారు. గ్రామం నుంచి బయలు దేరి ప్రగతి నివేదన సభకు వెళ్లి.. తిరిగి ఆ గ్రామాని కి సురక్షితంగా చేరుకొనేలా.. ప్రతి వాహనానికి ఒకరికి బాధ్యతలు అప్పగించారు. ఏ గ్రామం నుంచి ఎంత జన సవిూకరణ చేస్తారో.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులకు సంబంధించి ప్రధాన రూట్లలో ఇబ్బందులు లేకుండా.. ఇతర బస్సులను అద్దెకు ఇస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని.. సిద్దంగా పెట్టారు. స్థానికంగా వాహనాలు సరిపోని పరిస్థితుల్లో మహారాష్ట్ర సరిహద్దుల్లోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు.. అక్కడి నుంచి ప్రైవే టు వాహనాలు అద్దెకు తీసుకుంటున్నారు.