మక్కామసీదు పేలుళ్ల నిందితుడు అరెస్టు

హైదరాబాద్‌: నగరంలో సంచలనం సృష్టించిన మక్కామసీదు పేలుళ్ల కేసులో నిందితుడు రాజేంద్ర చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ దర్యాప్తు బృందం నిందితున్ని ఉజ్జయినిలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరిలించినట్లు సమాచారం. మే 18,2007లో మక్కామసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.