మద్యం దుకాణాలను పూర్తిగా ఎత్తివేస్తాం : చంద్రబాబు

వరంగల్‌: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గొలుసుమద్యం దుకాణాలను పూర్తిగా ఎత్తివేస్తామని చంద్రబాబునాయుడు అన్నారు వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికల్‌పేటలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతూ ధరల పెరుగుదలతో పేదల బతుకులు చితికిపోయాయన్నారు. వైకాపా నేత దోచుకున్న సొమ్మురు వసూలు చేస్తే ఐదుసార్లు రైతుల రుణాలు మాఫీ చేయవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆత్మకూరు-కామారం మధ్య ఉన్న చలివాగుపై చెక్‌డ్యామ్‌ నిర్మస్తామని చంద్రబాబు స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.