మద్యం సిండికేట్‌ కేసు విచారణ వాయిదా

హైదరాబాద్‌ : మద్యం సిండికేట్‌ కేసు విచారణను హైకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. మద్యం సిండికేట్‌ కేసులో 840 మందిని నిందితులుగా పరిగణిస్తూ ఏసీబీ నివేదికలో పేర్కొంది. 45 కేసులు నమోదుకాగా వాటిలో ఐదు కేసుల్లో నిందితులకు ప్రాసిక్యూషన్‌కు అనుమతించామని ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం జరిగిన విచారణలో ఏసీబీ నివేదికపై చర్యలకు ప్రభుత్వం మూడు నెలలు గడువు కోరగా.. మూడు వారాలు సరిపోతాయని హైకోర్టు సూచించింది.