మధ్యంతర బెయిల్‌పై మోపిదేవి విడుదల

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టెన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఏడాది మే 24నుంచి చంచల్‌ గూడ జైలులో ఉంటున్న మోపిదేవి ఈ రోజు ఉదయం విడుదయ్యారు. అయ్యప్ప దీక్షలో ఉన్న మోపిదేవి శబరిమల వెళ్లేందుకు జనవరి 2 వరకు సీబీఐ కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. జనవరి 3న ఆయన తిరిగి సీబీఐ కోర్టులో లొంగిపోనున్నారు. మధ్యంతర బెయిలుపై ఉన్న సమయంలో దర్యాప్తుని ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించ రాదని కోర్టు షరతు విధించింది.