మధ్యాహ్నం నుంచి అన్నదానం యథావిధి
తిరుమల, జనంసాక్షి: తిరుమలలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి యథావిధిగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని టీటీడీ ప్రకటించింది. ఈ రోజు ఉదయం అన్న ప్రసాదాలు తయారు చేసే క్యాంటీన్‌లో గ్యాస్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దాంతో ఈ ప్రమాదం కారణంగా మధ్యాహ్నం వరకూ అన్న ప్రసాదాలు నిలిపి వేశారు. మధ్యాహ్నం నుంచి యథావిధిగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.


