మనకద్దు విదేశీ విష సంసృతి

జూలపెల్లి : భారతీయులు విదేశీ విష సంసృతిని విడనాడాలని ఆర్‌ ఎస్‌ ఎస్‌ జిల్లా సహ కార్యవాహ్‌ సామల కిరణ్‌ పిలుపు నిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో రక్షబందన్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం పాశ్చాత్యా , ఉన్నత విలువలను పాశ్చాత్యా దేశాలకు తెలిపిందన్నారు. పాశ్చాత్యా  పేర  యువకులు విషపు పోకడలను అలవర్చుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత సంసృతిని విద్యార్తులు పరిరక్షించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో చొప్పదండి ఏబీవీపీ బాగ్‌ కన్వీనర్‌ మల్లేష్‌, విద్యాసాగర్‌, ఉపాద్యాయులు ఆనందం, సావిత్రి, రాజమౌళి, తదితరులు పాల్గున్నారు.