మల్లన్న సేవలో తమిళనాడు గవర్నర్‌ రోశయ్య

శ్రీశైలం:శ్రీశైలభ్రమరాంబా మల్లిఖార్జున స్వామిని తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజగోపురం వద్ద ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అర్చకులు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవస్థానం నూతనంగా నిర్మించిన భ్రమరాంబ అతిధి గృహాన్ని ప్రారంభించారు. వాసవి సత్రంలో ఆర్యవైశ్యుల రోశయ్య దంపతులను సన్మానించారు.