మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌పవార్‌ ప్రమాణం

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌ తిరిగి చేరారు. ఉపముఖ్యమంత్రిగా ఆయన ఈ ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణం చేశారు. మహారాష్ట్ర నీటి పారుదల శాఖలో చోటుచేసుకున్న అవినీతి కుంభకోణంలో ఆరోపణలు రావడంతో సెప్టెంబర్‌  25న అజిత్‌పవార్‌ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే పవార్‌ను తిరిగి ప్రభుత్వంలో చేర్చుకోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. నీటిపారుదల కుంభకోణంలో పవార్‌ పాత్రపై ప్రత్యేక దర్యాప్తు సంస్థచే విచారణ చేయించాల్సిందిగా డిమాండ్‌ వ్యక్తం చేశాయి.