మహిళల కోసం అతి పెద్ద వస్త్ర ప్రపంచం ఎవ్రీ డే ఫ్యాషన్‌

కరీంనగర్‌ టౌన్‌ ఆగస్టు 5 (జనంసాక్షి) :నగర మహిళల కోసం అతి పెద్ద వస్త్ర ప్రపంచం ఎవ్రీ డే ఫ్యాషన్‌ నేడు ప్రారంభం కానుంది. మహిళల కోసం అన్ని రకాల వస్త్రాలు, ఫ్యాషన్‌లు ఒకే దగ్గర లభ్యమయ్యే అవకాశం ఉండడంతో మహిళలు దీని ప్రారంభానికి ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎంఎల్‌ఏ గంగుల కమలాకర్‌లు ప్రారంబించనున్నారు. ఈ సందర్భంగా సినీ తారలు అర్చన, పూనమ్‌కౌర్‌, కామ్న జెఠ్మలానిలు తమ తళుకు బెళుకులతో అందర్నీ అలరించనున్నారు. దీంతో నగర ప్రజలు సినీ తారల రాకకై ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు షాప్‌ యజమానులు తెలిపారు.  ఒకే చోట రెడీమేడ్స్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌, కాస్మొటిక్స్‌, సారీస్‌, వెస్ట్రన్‌ వేర్‌ ఐటమ్స్‌లు లభించనున్నట్లు తెలిపారు. అంతేకాక మహిళలు, యువతుల కోసం అన్ని రకాల వస్తువులు, ఆభరణాలు తదితరాలు లభిస్తాయని పేర్కొన్నారు. అమ్మాయిలకైనా, శ్రీమతులకైనా అన్నీ అందించే ఏకైక షోరూంగా నిలుస్తుందని యాజమాన్యం తెలిపింది. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.