మహిళల టీ 20: లంకపై దక్షిణాఫ్రికా విజయం
గాలె: మహిళల టీ 20 క్రికెట్ ప్రారంభమైంది. గాలెలో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్‌కు దిగిన లంక 79 పరుగులకు అలౌటయింది. అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 17.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి విజయ లక్ష్యాన్ని చేరుకుంది.



