మహిళాబిల్లుపై శ్రద్ద ఏదీ? నారాయణ

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వానికి చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు, అణు ఒప్పందంపై ఉన్న శ్రద్ద మహిళా బిల్లుపై లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. మహిళలపై జరుగుతున్న హింసాత్మక దాడులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య నగరంలోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించింద . ధర్నాలో పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ పట్టన్నట్టు వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. ధర్నాలో మహళాసమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి అనీరాజా… తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఛలో అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన మహిళాకార్యకర్తల్ని పోలీసులుఉ అడ్డుకోని ముషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

తాజావార్తలు