మహిళ రక్షణ కోసం టోల్ ఫ్రీ -జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిర
జనగామ (జనం సాక్షి)ఆగస్ట్ 26:ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టడీ సౌజ ఆదేశాల మేరకు టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మరియు మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావు సూచనలతో జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా జనగామ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిర పాల్గొని మాట్లాడారు ఆగస్టు 20న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీరాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టడీ సౌజ మరియు అన్ని రాష్ట్రాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కలిసి దేశవ్యాప్తంగా ఆపదలో ఉన్న మహిళలకు సహాయం చేసేందుకు అఖిల భారత మహిళా కాంగ్రెస్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ స్ట్రీ సహాయం, అత్యవసర, మరియు సాధికారిత కోసం మద్దతు బృందం ఈ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ లాంచ్ చేయడం జరిగింది అని టోల్ ఫ్రీ నెంబర్ (1800-2030589 ) సంప్రదించవచ్చు అనితెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగాల కల్యాణి జనగామ మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని జయ బచ్చనపేట మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు వేణు వందన స్టేషన్ ఘణపురం మండల అధ్యక్షురాలు చింత జోష్ణ జాఫర్ గడ్ మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు పోనగంటి శ్రీవాణి తరిగొప్పుల మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగపూరి పద్మ చిలుపూరు మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గాజుల రజిని సీనియర్ మహిళ కాంగ్రెస్ నాయకురాలు గాడిపెళ్లి సక్కుబాయి కూకట్ల సుజాత గంగ భవాని మునిబేగం తదితరులు పాల్గొన్నారు.