మహీంద్రా క్వాంటో విడుదల

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌ ప్లాంట్‌ ద్వారా ట్రాక్టర్ల ఉత్పత్తి ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫార్మ్‌ ఎక్వివ్‌మెంట్స్‌ ప్రెసిడెంట్‌ పవన్‌ గోయంకా తెలిపారు. మెదక్‌ ప్లాంట్‌ ద్వారా దేశంలోనే అత్యధిక ట్రాక్టర్ల ఉత్పత్తి సంస్థగా మహీంద్రా ఎదగనుందని ఆయన చెప్పారు. మహీంద్రా ఆటోమోటివ్‌ రూపొందించిన స్పోర్ట్‌ యుటిలిటీ వాహనం క్వాంటోను ఆయన హైదరాబాద్‌ మార్కెట్‌లోకి విడుదల చేశారు.