మాజీ ఎమ్మెల్యే మజ్జి నారాయణ రావు కన్నుమూత
శ్రీకాకుళం: పాత సోంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మజ్జి నారాయణరావు (77) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన పాత్రపురంలోని స్వగృహంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1983లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో సర్దార్ గౌతులచ్చన్న కుటుంబానికి చిరకాల ప్రత్యర్ధిగా కొనసాగి జిల్లాలో కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేశారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు మజ్జి తులసీదాస్‌కు సోదరుడైన నారయణరావు ఆర్జీసీ జోనల్ ఛైర్మన్‌తోపాటు ఫిలిం సెన్సార్‌బోర్డు సభ్యునిగా పలు పదవులు నిర్వహించారు.



