మాణికేశ్వరీనగర్‌లో తెలంగాణవాదుల అరెస్టు

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌కు దగ్గరలోని మాణికేశ్వరీనగర్‌లో పోలీసులు 50 మంది ఉద్యోగులను  అరెస్టు చేశారు. వీరంతా ఉద్యోగాలకు వెళ్లేందుకు కాలకృత్యాలు తీర్చుకుంటుండగా అరెస్టు చేసి అంబర్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉద్యోగులను అరెస్టు చేయడంపట్ల తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.