మాదక ద్రవ్యాల ముఠా అరెస్టు

కూకట్‌పల్లి: కూకట్‌పల్లిలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముసాపేటకు చెందిన విష్ణు గత కొంతకాలంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా పెట్టిన పోలీసులకు ఈ రోజు పట్టుకున్నారు. శేరిలింగంపల్లికి చెందిన విజయ్‌ కుమార్‌, ప్రగతి నగర్‌లో నివాసముండే సోమిశెట్టి శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మర్పూరు గ్రామానికి చెందిన రాజ్యవర్ధన్‌ రెడ్డి, మూసాపేటలోని భరతనగర్‌ నివాసి వాయిలపల్లి చైతన్యకుమార్‌లను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 18 లక్షల విలువచేసే డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.