మార్చ్‌కు అందరూ సహకరించాలి: పాల్వాయ్ గోవర్థన్‌రెడ్డి
హైదరాబాద్: సెప్టెంబర్ 30న నిర్వహించబోయే తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వంతోపాటు వివిధ పార్టీలు, పార్టీల నేతలు అందరూ సహకరించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్ గోవర్థన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల గొంతు నొక్కెహక్కు ఎవరికీలేతని ఆయన హెచ్చరించారు, మార్చ్‌లో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి ప్రభుత్వానిదే భాద్యత అని హెచ్చరించారు. వైఎస్ విజయలక్ష్మీ, చంద్రబాబుల పర్యటనలకు భద్రత కల్పించే ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ మార్చ్‌కు ఎందుకు పోలీసు రక్షణ కల్పించదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పార్టీ హైకమాండ్‌కు చేరవేస్తానని పాల్వాయ్ గోవర్థన్‌రెడ్డి తెలియజేశారు.



