మీడియా ముందు కంటతడి పెట్టిన పయ్యావుల

హైదరాబాద్‌ : తాను వైకాపాలోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలు ఎంతో బాధ కలిగించామని తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ అవేదన వ్యక్తం చేశాడు. ఎన్టీఅర్‌ ట్రస్టుభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ వైకాపాలోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించి పయ్యావుల కంటతడిపెట్టాడు. వైకాపా వ్యూహంలో భాగంగానే అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వారు, వీరు వస్తున్నారంటూ అ పార్టీ మానసికంగా నేతలను అందోళనకు గురిచేస్తోందని అన్నారు. జగన్‌ తండ్రి వైఎన్‌తోనే పోరాటం చేసిన తాను అ పార్టీలోకి వెశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. వైకాపా నేతలకు చిత్తశుద్ది ఉంటే ఈ విషయంలో కాణిపాకం వినాయకుడి ఎదుట ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. ప్రతిష్ట, గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రయత్నిస్తే బెదిరే మనిషిని తాను కాదని పేర్కోన్నారు. తెదేపా సైనికుడిగా పార్టీ కోసం మున్ముందు మరింత కృషి చేస్తారని వెల్లడించారు. మీడియా బాద్యత, సమన్వయంతో వ్యవహరిస్తే బాగుంటుందని సూచించారు.