ముంబయిలో పలు సంస్థలపై ఐటీశాఖ దాడులు

ముంబయి: ముంబయిలోని 12 సంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. నితిన్‌ గడ్కరరీకి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థల కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.