ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

share on facebook

 నాయక్ కొండమల్లేపల్లి జనవరి 24 (జనంసాక్షి) న్యూస్ :
గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత దళిత సంక్షేమానికి ప్రభుత్వం కృషి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి 24గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శం కొండమల్లెపల్లి మండలం చింతకుంట్ల,కోర్రోని తండా గ్రామాలలో రూ.57లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఊరు -మన ప్రభుత్వం-మన పథకాలు కార్యక్రమం భాగంగా కొండమల్లెపల్లి మండలం చింతకుంట్ల,కోర్రోని తండా , డీయంకుంట గ్రామాలలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చింది అని దేవరకొండ శాసన సభ్యులు, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ గారు అన్నారు.మంగళవారం ఊరు -మన ప్రభుత్వం-మన పథకాలు కార్యక్రమం భాగంగా కొండమల్లెపల్లి మండలం చింతకుంట్ల గ్రామంలో 1కోటి 34 లక్షల 50 వేలు తో చేపడుతున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన రూ.27లక్షల అభివృద్ధి పనులకు,కొరొని తండా రూ.30లక్షల అభివృద్ధి పనులకు, దేశ్ ముక్ కుంట గ్రామంలో రూ.7.50 లక్షలతో చేపడుతున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా గ్రామాలలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అని ఆయన తెలిపారు.గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.మిషన్ భగీరథ ద్వార ప్రతి ఇంటింటికి సురక్షితమైన తాగు నీరు అందించడం జరిగింది అని ఆయన తెలిపారు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా అని ఆయన అన్నారు.ప్రతీ నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.సీఎం కేసీఆర్ వచ్చాక ఆసరా పెన్షన్లు,నిరంతర ఉచిత కరెంటు, ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేసుకుంటున్నామంటూ ఏ పైరవీ చేయకుండానే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితోనే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నారని ప్రభుత్వ సంక్షేమం అని ఆయన వివరించారు.తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది అని ఆయన పేర్కొన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను కోరారు. అంతేగాకుండా, గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను ప్రభుత్వం అందజేస్తున్నదని చైతన్యపర్చాలని కోరారు. ప్రతీ గ్రామంలో రైతులను విజ్ఞానవంతులుగా చేసేందుకు రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని చెప్పాలని కోరారు. పేదింటి అడబిడ్డల పెండ్లి కోసం కల్యాలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం రూ.1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, రైతు బంధు మండల అధ్యక్షుడు కేసాని లింగా రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,జడ్పీటీసీ సలహాదారుడు పసునూరు యుగేందర్ రెడ్డి,బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమావత్ దస్రు నాయక్,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, నేనావత్ రాంబాబు నాయక్,గుండెబోయిన లింగం యాదవ్, రామావత్, లాలూ నాయక్,రావుల వెంకటయ్య, రావుల సత్యనారాయణ,స్థానిక సర్పంచులు రుద్రమ్మ శ్రీనివాస్,కొర్ర లఛ్చిరాం నాయక్, ఉప సర్పంచ్ యేకుల సురేష్ కుమార్, ఉప సర్పంచ్ కొర్ర పాండు నాయక్,బోడ్డుపల్లి కృష్ణ,రమావత్ బీమ్ సింగ్,రామావత్ రాములు నాయక్, కొర్ర పథ్యానాయక్,ఎంపీడీఓ బాలరాజు రెడ్డి, సెక్రటరీ అబ్దుల్ లతీఫ్, శంకర్ నాయక్,శ్రీరాములు, ఇద్దయ్య, పోషమోని శ్రీను,హరిక్రిష్ణ, రామకృష్ణ గ్రామ శాఖ అధ్యక్షుడు బచ్చనబోయిన ఇదయ్య, ఉపాధ్యక్షుడు పంది రాములు, ప్రధాన కార్యదర్శి శవ్వ శ్రీనివాస్, దాసరి రామకృష్ణ పంది ఎంకులు శవ్వ మధార్, గోపాల మిత్ర వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.