ముఖ్యమంత్రి పర్యటనలో విద్యుత్ కోతలపై నిరసన
విజయవాడ: కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట కార్యక్రమం నిరసనలతో ప్రారంభమైంది. సీఎం గన్నవరం బావాజీగూడెం రహదారి శంకుస్థాపన చేస్తున్న సమయంలో భవన నిర్మాణ కార్మికులు, రైతులు ఒక్కసారిగా తమ నిరసన తెలియజేశారు. విద్యుత్ కోతలతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతున్నాయని విద్యుత్ కోతలను ఎత్తివేయాలని రైతులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.



