ముగిసిన అక్బరుద్దీన్‌ తోలిరోజు విచారణ

ఆదిలాబాద్‌: మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడన్న కేసులో అరెస్టయిన మజ్లిన్‌ శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ను పోలీసులు తొలిరోజు విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు ఆయనను నిర్మల్‌ పోలీసులు విచారించారు. నిర్మల్‌లో జరిగిన బహిరంగసభలో అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై వారు నిశితంగా ఆరా తీశారు. అక్బరుద్దీన్‌ను న్యాయస్థానం 5 రోజుల పాటు పోలీసుకస్టడీకి పంపిన విషయం తెలిసిందే.