ముగిసిన సూకీ పర్యటన
అనంతపురం: మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్‌సాన్‌సూకీ పర్యటన అనంతపురం జిల్లాలో ముగిసింది, పాపసానిపల్లెలో పర్యటించి డ్వాక్రా మహిళా సంఘాల పనితీరును ఆమె తెలసుకున్నారు. అనంతరం సూకీ హెలికాఫ్టర్‌లో బెంగళూరు బయలుదేరారు. ఆమెకు పాపసానిపల్లెలో కేంద్ర మంత్రి జైరాంరమేష్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు.



