మూషిక వాహన వినాయకుని దర్శించుకున్న

వివిద పార్టీల నేతలు.
పార్టీలకు అతితంగా అన్నదానకార్యక్రమంలో.
అన్నం పరబ్రహ్మ స్వరూపం.
అన్ని దాలకన్న మిన్న….. అన్నదానం.
తాండూరు సెప్టెంబర్ 9(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామ బస్ స్టేషన్ ఆవరణలో ప్రతిష్టించిన శ్రీ మూషిక వాహన వినాయక మండపంలోని వినాయకుని పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఈసందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూప
మన్నారు. అన్ని దాలకన్న మిన్న….. అన్నదానం గోప్పదన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి రాజకీయ నేతలు వివిధ సంఘాల నాయకులు ప్రతినిధులు యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజకీయ నాయకులకు ప్రముఖులకు గణేష్ మండప నిర్వాహకులు ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న .జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాందాస్, రామలింగారెడ్డి, వెంకట్ రెడ్డి ,సాయి రెడ్డి, రవి గౌడ్ మరియు బిఎస్పి పార్టీ నాయకులు చంద్రశేఖర్ వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.