మెట్రో రైలు సర్కారు స్వాధీనం

` ఎల్ అండ్ టీతో షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రక్రియ
హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరమైంది. ఎల్ అండ్ టీతో షేర్ల కొనుగోలు ఒప్పందం ప్రక్రియ పూర్తయ్యింది. రూ.1,461.47 కోట్ల విలువైన వంద శాతం షేర్ల బదిలీ జరిగింది. ఈ ఒప్పందంపై హెచఎంఆరఎల్ తరఫున ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీ లిమిటెడ్ తరఫున డీకే సేన్, ఎలఅండ్‌టీ మెట్రోరైలు (హైదరాబాద్) లిమిటెడ్ తరఫున కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. వాస్తవంగా మార్చి 31ని మెట్రో స్వాధీన తేదీ అనుకున్నప్పటికీ.. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆరఎఫ్‌సీ) నుంచి రుణం మంజూరు ఆలస్యం కావడంతో గడువును ఏప్రిల్ 30కి పొడిగించారు.ఎల్ అండ్ టీ, మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థ 2017 నవంబర్ నుంచి మÖడు కారిడార్లలో మొత్తం 69 కిలోవిÖటర్ల నెట్‌వర్క్‌తో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్`ఎను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఫేజ్`ఎను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఫేజ్`ఎ, ప్రతిపాదిత ఫేజ్`ఎఎ నెట్‌వర్క్ రూపకల్పన, పనులు, సేవల అమలు సులభతరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.