మెడికల్ షాప్ యజమానిపై కత్తితో దాడి
హైదరాబాద్ : ఎల్బీనగర్‌లో ఓ మెడికల్ షాప్ యజమానిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. టాబ్లెట్ ఇవ్వలేదని ఆగ్రహిస్తూ సాధిక్ అనే వ్యక్తి ఈ ఈ ఘటనకు పాల్పడ్డాడు. మెడికల్ షాపు యజమాని పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్త ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


