మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: సీఎం

హైదరాబాద్‌: దేశంలో లౌకికవాదాన్ని ఖచ్చితంగా పాటించేది కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌ పాలిత ప్రభుత్వాలేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మైనార్టీల సంక్షేమానికి కట్టుబడిన ఏకైక ప్రభుత్వం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం పలువురు ముస్లిం మత పెద్దలు ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రంలో దెబ్బతిన్న మసీదుల మరమ్మతులకు రూ. 15 కోట్లు ప్రకటించినందుకు వారు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు.