యుద్ధానికి మేము సిద్ధం జంగుసైరనూదిన టీఎస్‌, ఓయూ జేఏసీ

హైదరాబాద్‌, జనవరి 22 (జనంసాక్షి) :
తెలంగాణ సాధన కోసం యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలంగాణ స్టూడెంట్‌, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ బాధ్యులు తేల్చిచెప్పారు. మంగళవారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఈనెల 27న రాజ్‌భవన్‌ను ముట్టడించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీని సీమాంధ్ర పెట్టుబడిదారులు రకరకాలుగా మేనేజ్‌ చేసి వచ్చిన తెలంగాణను
అడ్డుకున్నారని తెలిపారు. ఇకపై అలా జరుగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు అప్రమతత్తతో ఉండాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఏమాత్రం ఆదమరిచిన సీమాంధ్ర పెట్టుబడిదారులు గద్దల్లా తెలంగాణను తన్నుకుపోవడం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎస్‌ జేఏసీ నేత పిడమర్తి రవి, గజ్జెల కాంతం తదితరులు పాల్గొన్నారు.