యువతి అనుమానాస్పద మృతి

మచిలీపట్నం : బంటుమిల్లిలో ఓ యువతి అనుమానాస్పద రీతిలో గురువారం ఉదయం మరణించింది. పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. కాగా ఆ యువతికి రెండు నెలల క్రితమే వివాహమైందని స్థానికులు పోలీసులకు వెల్లడించారు.

తాజావార్తలు