రంగారెడ్డి కలెక్టరెట్ ముట్టడించిన సీపీఐ
హైదరాబాద్: ఈ రోజు సీపీఐ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు రంగారెడ్డి కలెక్టరెట్‌ను ముట్టడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో ఉన్న 40ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు.



