రక్తదానం పై యువత చైతన్యం కావాలి

 

 

 

 

మోత్కూరు సెప్టెంబర్ 3 జనంసాక్షి : రక్తదానం చేయడంపై యువత అవగాహన లోపంతో ముందుకు రావడంలేదని యువతను చైతన్యం చేసే దిశగా కృషి జరగాలని అందుకు ఉపాధ్యాయులు విద్యార్థులు మేధావులు కృషి చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ డాక్టర్ జి లక్ష్మీ నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మోత్కూరు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్ కేంద్రంలోని జొన్నల లింగయ్య పెట్రోల్ బంకు ఆవరణలో నిర్వహించిన శిబిరంలో 50 మంది రక్తదానం చేశారు.ఈ సంధర్భంగా మున్సిపల్ కమిషనర్ సి. శ్రీకాంత్, మండల తహసిల్దార్ షేక్ అహ్మద్ ,ఇంచార్జి ఎంపీడీవో చంద్రమౌళి,స్థానిక ఎస్సై వి. జానకి రామ్ రెడ్డి రక్తదానం చేసిన దాతలను అభినందించారు. కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ,చొల్లేటి స్వామి నరసింహ చారి ,అనిల్ చేపూరి, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సురోజు భాస్కరాచారి, పూర్వ ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శి కట్టా రమేష్, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి అక్కినేపల్లి వెంకటాచారి , జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ కొనతం శ్రీనివాస్ ,మోత్కూరు, ఆత్మకూరు, గుండాల, అడ్డగూడూరు మండలాల అధ్యక్ష కార్యదర్శులు తొర్ర ఉప్పలయ్య, డాకోజు నరేష్, దర్శనం వెంకన్న జూకంటి కరుణాకర్ దోర్నం వెంకన్న,ఉపాధ్యాయులు పి.నరసయ్య, కె.రవి, జి.మల్లేశం, డి.శ్రీనివాస్, సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.
Attachments area