రథయాత్ర యోచనను విరమించుకోవాలి
హైదరాబాద్: స్వామి పరిపూర్ణనంద నవంబరు 1 నుంచి ప్రారంభించనున్న రథయాత్రను వెంటనే విరమించుకోవాలని రాష్ట్ర క్రైస్తవ సామాజిక ఐక్య వేదిక డిమాండ్ చేసింది. దళిత, బలహీన వర్గాల క్రైస్తవ సామాజిక ఐక్య వేదిక డిమాండ్ చేసింది. దళిత, బలహీన వర్గాల క్రైస్తవులను హిందువులుగా మారుస్తానని ధర్మప్రచార యాత్ర ప్రారంభించటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు, దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని క్రైస్తవ ఐక్య వేదిక ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు క్రైస్తవ సమాజానికి భద్రత, రక్షణ కల్పించాలని కోరుతూ రాష్ట్ర క్రైస్తవ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీని కలిసి వినతి పత్రం అందజేశారు.



