రాజకీయ లబ్థి కోసమే తెలంగాణా వాదం: మోత్కుపల్లి
హైదరాబాద్: తెలంగాణ ప్రజలతో కేసీఆర్, కాంగ్రెస్ నాయకులు ఆటలాడుకుంటున్నారని తెదేపా నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు, షిండే, ఆజాద్‌లు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుంటే కేసీఆర్ ఎందుకు నోరు ఎత్తడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ధికోసమే తెలంగాణ వాదాన్ని కేసీఆర్ పణంగా పెడుతున్నారని ఆయన తెలియజేశారు.



