రాజపక్సే భారత్‌ పర్యటనను వ్యతిరేకించిన డీఎంకే

చైన్నై : శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే త్వరలో భారత్‌లో జరపనున్న పర్యటన తమకు సమ్మతం కాదని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అన్నారు. వేలాదిమంది. శ్రీలంక తమిళుల వూచకోతకు కారణమైన రాజపక్సేకు భారత్‌లో పర్యటించే అర్హత లేదన్నారు. అయితే శ్రీలంక క్రీడాకారులు మన దేశంలో పర్యటిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని ఆయనన్నారు.