రాజీనామాకే ‘ కావూరి ‘ మొగ్గు
హైదరాబాద్ : ఎంపీ పదవికి రాజీనామా విషయంలో వెనక్కు తగ్గనని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు చెప్పారు. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రధానితో అపాయింట్‌మెంట్‌ను తానే కోరానని తెలిపారు. ప్రధానితో మాట్లాడిన తరువాత కూడా తాను ఇంకా అసంతృప్తిగానే ఉన్నానని చెప్పారు. రాజీనామా విషయంలో తన వైఖరిలో మార్పు లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడాన్ని కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఐదు పర్యాయాలు ఎంపీగా ఉన్న తనను పక్కనపెట్టి జూనియర్ అయిన పురందేశ్వరి, తదితరులకు మంత్రిపదవి ఇవ్వడంపై కావూరి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇంకా తాను పార్టీలో కొనసాగే అవసరం ఏమిటని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ప్రధాని, అధినేత్రి సోనియాగాంధీకి లేఖలు రాశారు.



